వారిని చూస్తుంటే గుండె కరిగిపోతోంది: అలీ

Update: 2019-11-30 10:26 GMT
అలీ

డాక్టర్‌ ప్రియాంక తల్లిదండ్రులను చూస్తుంటే గుండె కరిగిపోతోందని సినీనటుడు అలీ అన్నారు. వైద్యురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన అలీ వైద్యురాలికి జరిగిందే నిందితులకూ జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని చెప్పారు.

వైద్యురాలు తన కూతురు లాంటిందన్నారు. కనీసం తల్లిదండ్రులకు శవం కూడా లేకుండా చేయడం దారుణమన్నారు. శవమైనా దొరికుంటే ఇంత బాధపడేవారు కాదేమో? అని అభిప్రాయపడ్డారు. వైద్యురాలి తల్లిదండ్రులు ఏడుస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. కేసు వాదించకూడదని బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. 

Tags:    

Similar News