సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్... ప్రభాస్ రావాలంటూ...

Update: 2019-09-11 14:00 GMT

జనగామ జిల్లాలో ఓ యువకుడు హల్ చల్ చేసాడు. హీరో ప్రభాస్ తనని కలవడానికి రావాలని సెల్ టవర్ ఎక్కాడు. లేని పక్షంలో ఇక్కడి నుండి దూకి చనిపోతానని బెదిరించాడు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో వెంకన్న అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి నానా హంగామా చేసాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి వెంటనే వారు చేరుకున్నారు. అతన్ని కిందికి దిగాలని కోరారు కానీ అతడు ప్రభాస్ వస్తేనే దిగుతానని మొండికేసాడు. ఇలా నాలుగు గంటలు అక్కడే ఉండిపోయాడు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత సెల్ టవర్ నుండి కిందికి దిగాడు. అతడి మానసిక పరిస్థితి ఏమి బాగులేదని అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు..

Tags:    

Similar News