బుడతడే కానీ క్రికెట్ ఆటలో ఘనుడు...

Update: 2019-11-11 12:50 GMT
cricket child

సహజంగా అయితే క్రికెట్ ఆట మనకి ఓ పదేళ్ళకి తెలుస్తుంది. పక్కన వాళ్ళు ఆడుతుంటే చూసి నేర్చుకొని కొన్ని రోజుల తర్వాత ఆడడం స్టార్ట్ చేస్తాం.. కానీ ఈ బుడతడు మాత్రం ఇంకా డైపర్స్‌లోనే ఉన్నాడు కానీ అప్పుడే ఆటను మడత పెట్టేస్తున్నాడు... ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ లాగా ఆడుతున్నాడు. బంతిని అంచనా వేయడం నుండి ఆ బంతిని చూడ చక్కని షాట్లతో బౌండరీలకు తరలించే వరకు చాలా అద్భుతంగా కొట్టేస్తున్నాడు...

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా ఈ వీడియోని చూసి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్‌ వాన్‌ కూడా షాక్ అయ్యాడు. బహుశా ఈ బుడతడు ఇంగ్లాండ్ గడ్డపై పుట్టే ఉంటాడని స్పందించాడు. ఇక వీడియోకి గాను నెటిజన్లు కూడా ఫీదా అవుతున్నారు. బుడతడే కానీ ఆటలో ఘనుడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Tags:    

Similar News