నటరాజ్ షాట్‌తో రణ్ వీర్ సింగ్‌...

Update: 2019-11-11 10:44 GMT
Kapil dev

భారత మాజీ క్రికెటర్, ఇండియన్ టీం మాజీ కెప్టెన్ కపీల్ దేవ్ తన క్రికెట్ కెరియర్ లో సాధించిన ముఖ్యమైన ఘట్టాలతో '83' అనే సినిమా తెరకెక్కుతుంది. కపీల్ దేవ్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు మొదటిసారిగా వరల్డ్ కప్ ను అందుకుంది. ఆ టైంలో జరిగిన విశేషాల ఆధారంగా ఈ టైటిల్ ని పెట్టారు. అయితే ఈ సినిమాకి సంబధించిన ఓ లుక్ ని బయటకు వదిలింది చిత్రబృందం.. ఇందులో కపీల్ దేవ్ ఫేవరేట్ షాట్ అయిన 'నటరాజ్ షాట్'ను విడుదల చేసింది. ఇందులో కపీల్ దేవ్ గా హీరో ర‌ణ్వీర్‌ సింగ్‌ కనిపించనున్నాడు. అయితే ఈ లుక్ పై కపీల్ దేవ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. హాట్స్ ఆఫ్ ర‌ణ్వీర్‌ అంటూ పోస్ట్ పెట్టాడు కపీల్ దేవ్ .. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 10 న విడుదల చేయనున్నారు.  



Tags:    

Similar News