సాహో టిజర్ కి గుడ్ రెస్పాన్స్ .. దియేటర్లో చొక్కాలు విప్పిన ప్రభాస్ ఫాన్స్ ..

Update: 2019-06-14 11:16 GMT

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో .. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .. సినిమా పైనే భారీ అంచనాలే ఉన్నాయి . అయితే సినిమాకి సంబంధించిన టిజర్ ని నిన్న విడుదల చేసింది చిత్ర బృందం . వచ్చీరావడంతోనే ఆన్ లైన్ లో రికార్డులు సృష్టించింది సాహో. కేవలం కొద్ది సమయంలోనే రెండు కోట్ల వ్యూస్ అందుకుని మరిన్ని రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది. ప్రస్తుతం సినిమా టీజర్ ను దేశవ్యాప్తంగా అనేక థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఓ థియేటర్ లో అయితే టీజర్ వస్తుండగా అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు . అయితే దీనిని హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఓ వీడియో రూపంలో ప్రభాస్ అభిమానులకు షేర్ చేసింది. చొక్కాలు విప్పుకుని మరీ అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయడం మనం ఆ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు.




Tags:    

Similar News