డేటాపై తూటా.. చంద్రబాబుపై జగన్‌ ఫైర్‌

Update: 2019-03-05 11:11 GMT

ఓ నేరగాడు ప్రజలను పాలిస్తున్న అన్యాయమైన రోజులివని, ఇలాంటి వ్యక్తి సీఎంగా పనిచేయడానికి అర్హుడా? అని జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని, రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారని, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. చివరకు, మా సొంత చిన్నాన్న ఓటు కూడా తొలగించే యత్నం చేశారని అన్నారు. తొలగించమని వచ్చిన అభ్యర్థనలో వైఎస్ వివేకానందరెడ్డి పేరు ఉంది కానీ నారా లోకేశ్ పేరు లేదని జగన్‌ అన్నారు. చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదని, రాష్ట్రంలో 39 లక్షలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేయించారని జగన్‌ ఆరోపించారు.

ప్రజల వ్యక్తిగత డేటాను చంద్రబాబు తన బినామీ కంపెనీలకు అప్పగించారని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, అలాంటి డేటా చంద్రబాబు బినామీ కంపెనీల వద్ద ఉందంటే వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలని తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన సమర శంఖారావం సభలో పాల్గొన్న జగన్‌ ప్రజల అకౌంట్లు, ఆధార్ నంబర్లు చంద్రబాబు వద్ద ఉన్నాయని విమర్శించారు. ప్రజల సంతకాలు కూడా ఫోర్జరీ చేసే రోజులొచ్చేశాయని జగన్‌ మండిపడ్డారు.

ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీపై సీఎం చంద్రబాబు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని జగన్ విమర్శించారు. ప్రజల వ్యక్తిగత వివరాలు అమ్ముకుంటూ ఇది నా డేటా అని చంద్రబాబు చెప్పుకోవడం దారుణమన్నారు. దొంగతనం చేస్తూ పట్టుబడ్డ బాబు ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా 'దొంగా దొంగా' అంటూ అరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు బినామీ కంపెనీలపై పోలీసులు దాడులు చేస్తే, ఆంధ్రా పోలీసులను అక్కడికి పంపారని, ఏపీ పోలీసులను తన వాచ్ మన్ లాగా వాడుకుంటున్నారని జగన్‌ తీవ్రంగా మండిపడ్డారు. 

Similar News