ఆ ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలుంటాయి: హైకోర్టు

Update: 2019-04-30 11:05 GMT

టీఆర్ఎస్‌ ఎల్పీలో సీఎల్పీ విలీనం చేయొద్దంటూ వేసిన పిటీషన్‌పై హైకోర్టు ఆసక్తికరమైన కామెంట్స్‌ చేసింది. కాంగ్రెస్‌ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే పిటీషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటీషనర్‌ తరపు న్యాయవాది రవిశంకర్‌ జంధ్యాల కోరారు. ఇప్పటికిప్పుడు విచారణ అవసరం లేదని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌రావు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం పిటీషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని విచారణను జూన్‌ 11 కు వాయిదా వేసింది. టీఆర్ఎస్‌ ఎల్పీలో సీఎల్పీ విలీనాన్ని అడ్డుకోవాలని టీ పీసీసీ చీఫ్‌ కాంగ్రెస్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క హైకోర్టులో నిన్న పిటీషన్ దాఖలు చేశారు. 

Similar News