టీడీపీ, జనసేన మధ్య చిచ్చు రాజేసిన టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యలు

ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పొత్తుపై మాటల యుద్ధం ముదురుతోంది. కొద్ది నెలల కిందట టీడీపీతో కటీఫ్ చెప్పిన జనసేన మళ్ళీ టీడీపీతో కలిసే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారం రెండు పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది.

Update: 2019-01-23 11:13 GMT

ఎన్నికల వేళ టీడీపీ, జనసేన పొత్తుపై మాటల యుద్ధం ముదురుతోంది. కొద్ది నెలల కిందట టీడీపీతో కటీఫ్ చెప్పిన జనసేన మళ్ళీ టీడీపీతో కలిసే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారం రెండు పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. పొత్తు గురించి జనసేన నేతలు గుంభనంగా వ్యవహరిస్తుంటే దోస్తీ ఖాయమంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానాలు చేయడం రెండు పార్టీల మధ్య చిచ్చు పెడుతోంది. తాజాగా టీజీ వెంకటేష్ హెచ్ఎంటీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.

టీడీపీ, జనసేన పొత్తు గురించి హెచ్ఎంటీవీతో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌. రెండు పార్టీలు కలిసేందుకు అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య పెద్దగా విభేదాలు లేవన్న టీజీ వెంకటేష్ కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే అభిప్రాయ భేదాలున్నాయని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో టీడీపీ జనసేన కలిస్తే తప్పేంటని టీజీ ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ ఇంటర్వ్యూలో టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాడేరు పర్యటనలో తీవ్రంగా స్పందించారు. టీజీ వెంటేష్ పిచ్చి పిచ్చే ప్రేలాపనలు మానుకోవాలని హెచ్చరించారు. పెద్దరికంతో వ్యవహరించాలని సూచించారు. జనసేన వదిలేసిన సీటులో ఎంపీగా ఎన్నికైన టీజీ వెంకటేష్..నోరు అదుపులో పెట్టుకోవాలని పవన్ వార్నింగ్ ఇచ్చారు. 

Similar News