ఎన్నికలపై మావోయిస్టుల ప్రభావం లేదు : అడిషనల్ డీజీ జితేందర్

Update: 2019-04-09 11:30 GMT

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. కేంద్ర బలగాలతో పాటు ఐదు రాష్ట్రాల నుంచి పోలీసులను రప్పించి ఆయా ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని అడిషనల్ డీజీ జితేందర్ వెల్లడించారు. కాగా ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ వెల్లడించిన నాటి నుంచి రాష్ట్ర పోలీస్‌ శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుందన్నారు. నిజామాబాద్‌లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశామని డీజీ జితేందర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ.37.76 కోట్ల నగదుతో పాటు రూ.1.01 కోట్ల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో అదనపు బలగాల మోహరించామన్నారు. ఎన్నికల్లో మావోయిస్ట్‌ల ప్రభావం లేదని తెలిపారు. ఎన్నికల విధుల్లో దాదాపు 55 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారని, కర్నాటక, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ నుంచి బలగాలు రప్పించామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగిలే చూస్తామని తెలిపారు. 

Similar News