కాసేపట్లో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం

Update: 2019-05-29 03:42 GMT

కాసేపట్లో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఉండవల్లిలోని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశంకానున్నారు.టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఉండకపోవచ్చని, సీనియర్‌ సభ్యులు ఎవరికైనా అవకాశమిస్తారని ఊహాగానాలు కొనసాగాయి. అయితే, ఈ వాదనలకు తెరదించుతూ.. శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించనున్నట్టు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. చంద్రబాబు నివాసంలో జరిగే టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నికల్లో పార్టీ ఓటమిపై చర్చించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు, క్షేత్రస్థాయిలో జరిగిన తప్పిదాలు, పథకాల అమలులో లోపాలను సమీక్షించనున్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించనున్నారు. 

Similar News