ఈసీ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు: రజత్ కుమార్

Update: 2019-03-31 04:13 GMT

నిజామాబాద్ పోలింగ్ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి అనుగుణంగా పోలింగ్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి రజత్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ పోలింగ్ విషయమై త్వరగా నిర్ణయించాలని కేంద్రఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. దీనిపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఈవీఎం, బ్యాలెట్ రెండు విధానాల్లోనూ పోలింగ్‌పై ఈసీకి నివేదించినట్లు చెప్పారు. ఈవీఎం ద్వారా నిర్వహిస్తే మరో 26 వేల బెల్ M3 యంత్రాలు అవసరమన్నారు. పోలింగ్ కేంద్రంలో కంట్రోల్ యూనిట్‌కు 12 బ్యాలెట్ యూనిట్లు అనుసంధానించాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యంత్రాలు ఎక్కడికక్కడ సర్దుబాటు అయ్యాయన్నారు. ఈవీఎం యంత్రాలను మరోచోటకు తరలించే పరిస్థితి లేదన్నారు. 

Similar News