లోక్‌సభ నుంచి టీడీపీ ఎంపీల సస్పెన్షన్

లోక్‌సభ నుంచి 14 మంది టీడీపీ ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సభ మొదలవగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్‌‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

Update: 2019-01-03 07:07 GMT
Lok Sabha

లోక్‌సభ నుంచి 14 మంది టీడీపీ ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. సభ మొదలవగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్‌‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్‌ వారిని నాలుగు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ వారిపై వేటు వేశారు. ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, తోట నరసింహం, మురళీమోహన్‌, బుట్టారేణుక, అవంతి శ్రీనివాస్‌, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్‌ గజపతిరాజు, కొనకళ్ల నారాయణలను నాలుగు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

Similar News