సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కు భారీ ఊరట

Update: 2019-05-06 12:45 GMT

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కు భారీ ఊరట లభించింది. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. మాజీ మహిళా ఉద్యోగిని ఆరోపణల్లో నిజం లేదని సుప్రీం ఇంటర్నల్ కమిటీ తేల్చింది. సీజేఐ రంజన్ గొగోయ్‌ తనను లైంగికంగా వేధించారంటూ సుప్రీం మాజీ ఉద్యోగిని ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపింది. ఏకంగా సీజేఐపైనే లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఇన్ హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. మహిళ ఆరోపణలపై దర్యాప్తు జరిపిన సుప్రీం ఇంటర్నల్ కమిటీ సీజేఐ రంజన్ గొగోయ్‌కి క్లీన్ చిట్ ఇచ్చింది.

Similar News