వీవీప్యాట్స్ లెక్కింపు వ్యవహారం.. సుప్రీంలో విచారణ

Update: 2019-03-25 09:23 GMT

ఎన్నికల సందర్భంగా వినియోగిస్తున్న వీవీ ప్యాట్స్ లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మరోసారి విచారించింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో వీవీ ప్యాట్లను లెక్కిస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. వీవీ ప్యాట్ల సంఖ్యను పెంచాలంటూ కోర్టును కోరారు .అయితే వీవీ ప్యాట్ల లెక్కింపులో తమకు పలు రకాల ఇబ్బందులున్నాయని ఈసీ తరపు ప్రతినిధి కోర్టుకు వివరించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వీవీ ఫ్యాట్ల లెక్కింపు కలుగుతున్న ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పడంతో కేసు విచారణను వాయిదా వేశారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల కల్లా అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించారు. అనంతరం కేసును శుక్రవారానికి వాయిదా వేశారు. 

Similar News