పవన్‌ మౌనం వ్యూహాత్మకమా ? లేక డైలమానా ?

Update: 2019-04-17 11:24 GMT

మొన్నటి వరకు ఏపీలో ఎన్నికల హడవిడితో హోరెత్తింది. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరోకరు మాటలతూటలు పేల్చుకున్నారు. మొత్తానికి ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఒక్కసారి ఏపీ మొత్తం చల్లబడింది. కానీ అక్కడక్కడ మాత్రం చిన్నపాటి గొడవలు అవుతూనే ఉన్నాయి. ఇక ఎన్నికల రణరంగంలో గెలుపు ఒటమిలపై ఇప్పటికే జోరుగా చర్చకొనసాగుతొంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో మాత్రం గెలుపు తమదే అంటూ ఇటు వైసీపీ, టీడీపీ డప్పుకొట్టుకుంటుంది. అయితే వైసీపీ మాత్రం ఏపీ ప్రజలు బాబుకు గుడ్ బై చెప్పలని నిర్ణయించుకున్నారని, బాబు పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అని వైసీపీ ధీమా వ్యక్తం చేశారు. ఇటు టీడీపీ కూడా బాబు పాలనే ప్రజలు కొరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో 140 సీట్లు ఖాయమంటూ ప్రకటనలు చేస్తోంది.

అయితే టీడీపీ, వైసీపీ నమ్మకాలు ఎలా ఉన్నాకానీ ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఓట్లపండుగ అయిపోయిన తరువాత పూర్తిగా డీలాపడిపోయింది. ఒక్కప్రెస్ మీట్ లేదు, ఏ హంకు ఆర్భటం లేదు. పవన్‌తో పాటు జనసేన అభ్యర్థులు కూడా ఎన్నికల తరువాత పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఎన్నికల సమరం ముగిసిన తరువాత ఒక్కటి రెండ్రోజులు ఉండి మళ్లీ పట్నంకి వాపస్ అయ్యారు పవన్. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుతో పాటు తమ పార్టీ గెలుపు అవకాశాలపై పవన్ కళ్యాణ్ నేటికి స్పందించలేనే లేదు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన కింగ్ లేదా కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని అంచనాలు వేసుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత మాత్రం ఈ విషయాన్ని ప్రకటించేందుకు జనసేన నేతలు ముందుకు రావడం లేదు. అయితే ఎన్నికల ఫలితాలపై పవన్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారేమో అని కొందరు జనసేన నేతలు భావిస్తున్నారు. కాగా ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై జనసేన అతిగా స్పందిస్తే ఆ తరువాత మొదటికే మోసం వస్తుందనే భావనలో జనసేనాని ఉన్నట్టు సమాచారం. ఓటింగ్ సరళి ఏ విధంగా ఉందనే విషయంపై ఏపీలో ఉన్న స్థానిక నేతలతో పూర్తి స్థాయిలో చర్చించిన తరువాతే దీనిపై స్పందించాలని జనసేనాని నిర్ణయించుకున్నారనే టాక్ కూడా ఉంది. మొత్తానికి త్వరగా పవన్ మౌనం అనే ముసుగుతీసి బయటకు రావాలని ప్రజలు, పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు.

Similar News