సీని జీవితం నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు నగరి వైసీపీ అభ్యర్థి ఆర్.కె. రోజా. తండ్రి పేరు: నాగరాజరెడ్డి, తల్లిపేరు: ప్రమీలమ్మ, భర్త: ఆర్.కె.సెల్వమణి. రోజా పుట్టిన తేది: పిల్లలు: అంచుమాలిక్, కృష్ణాకౌశిక్ . రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు.
రాజకీయ అనుభవం: ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో రోజా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004,2009 శాసనసభ ఎన్నికలలో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. కాగా 2014 శాసనసభ ఎన్నికలలోనగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుపై 858 ఓట్ల తేడాతో విజేతగా నిలిచారు.
నగరి టీడీపీ అభ్యర్థి - గాలి భానుప్రకాష్, తలిదండ్రులు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గాలి సరస్వతమ్మ. భానుప్రకాష్ పుట్టిన తేదీ: 20.06.1976. విద్యార్హత: ఎంఎస్(అమెరికా), భార్య: గాలి శిరీష, ఎంబీఏ, ఎంఎస్, పిల్లలు: జి.కృష్ణ, జి.రామానాయుడు. రాజకీయ అనుభవం: గాలి ముద్దుకృష్ణమనాయుడుతో పాటు 2009,2014 ఎన్నికల్లో చూరుగ్గా పాల్గొనడం, తండ్రి మృతి చెందిన అనంతరం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్నసంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.