ఆ పదవిపై ఆశలేదు : కోమటిరెడ్డి

Update: 2019-06-05 09:22 GMT

పీసీసీ పదవిపై తనకు ఆశలేదని, ఆ పదవిపై ఉత్సాహం ఎవరికైనా ఉంటే వారికే ఇవ్వమని చెపుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. రాజీనామా అంశం ఆయనకే తెలియాలన్నారు. తనకు పీసీసీ పదవిపై ఆశ లేదని తేల్చి చెప్పారు. పీసీసీ కంటే ముఖ్యమైన ఎంపీ పదవిని ప్రజలు తనకు కట్టబెట్టారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడతానని అన్నారు. అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని కోమటిరెడ్డి హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News