కేసీఆర్‌ కూటమి గురించి నాకు తెలియదు

తెలంగాణ సీఎం కేసీఆర్ కూటమి కడుతున్నారన్న విషయం తనకు తెలియదన్నారు ప్రధాని మోడీ. మూడు రాష్ట్రాలలో బీజేపీ పరాజయం చెందడంపై మొదటిసారి నోరు విప్పిన ప్రధాని మోడీ ఓడినంత మాత్రాన ఆత్మవిశ్వాసం దెబ్బతినదన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీ కట్టడంపై కౌంటర్ ఇచ్చారు.

Update: 2019-01-02 04:07 GMT
Narendra Modi

తెలంగాణ సీఎం కేసీఆర్ కూటమి కడుతున్నారన్న విషయం తనకు తెలియదన్నారు ప్రధాని మోడీ. మూడు రాష్ట్రాలలో బీజేపీ పరాజయం చెందడంపై మొదటిసారి నోరు విప్పిన ప్రధాని మోడీ ఓడినంత మాత్రాన ఆత్మవిశ్వాసం దెబ్బతినదన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో దోస్తీ కట్టడంపై కౌంటర్ ఇచ్చారు.

నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మోడీ ఓ జాతీయ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారనే విషయం తన దృష్టికి రాలేదని మోడీ చెప్పుకొచ్చారు. తనకు కేసీఆర్‌ కసరత్తు చేస్తున్న కూటమి గురించి అసలు తెలియదని అన్నారు

లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించడానికి కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న మహా కూటమిని మోడీ తప్పు పట్టారు. తెలంగాణ సహా జమ్ము కశ్మీర్‌, అస్సోం, త్రిపురలో విపక్షాల కూటమి ఘోరంగా ఓడిపోయిందని చెప్పారు. అసలు మహాకూటమిపై చర్చించాల్సిన అవసరం లేదన్నారు మోడీ. జీవితాంతం కాంగ్రెస్‌ను వ్యతిరేకించినవారు ఇప్పుడు ఆ పార్టీతో కూటమి అంటున్నారని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. అలాంటి రాజకీయాలతో లాభం లేదని మోడీ వ్యాఖ్యానించారు.

దక్షిణభారత దేశంలో బీజేపీ లేదనడం అసత్య ప్రచారమన్నారు మోడీ. ప్రస్తుతం గోవాలో అధికారంలో ఉన్నామనీ గతంలో కర్ణాటకలో పాలన చేశామని గుర్తు చేశారు. దేశం నలువైపులా బీజేపీ విస్తరించిఉన్న బీజేపీ ఉత్తరాది పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు.

2019 సార్వత్రిక ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్‌గాంధీ కాదని ప్రధాని అన్నారు. ప్రజల అవసరాలను తీరుస్తూ, వారి ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్లే వారు, ప్రజల ఆకాంక్షలను అడ్డుకునేవారి మధ్యే పోటీ అని వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల అనుభవం ఇదే చెబుతుందన్నారు. 

Similar News