దేశ భవిష్యత్‌ కోసమే చేతులు కలిపాం : మాయావతి

Update: 2019-04-19 09:23 GMT

సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ మధ్య ఉన్న విబేధాలను పక్కనపెట్టి కేవలం దేశ భవిష్యత్‌ కోసమే మళ్లీ ఎస్పీ - బీఎస్పీ చేతులు కలిపాయని మాయావతి స్పష్టం చేశారు. ములాయం సింగ్‌ పోటీ చేస్తున్న మెయిన్‌పూరి నియోజకవర్గంలో బహిరంగసభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ మెయిన్‌పురిలో ములాయంను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. వెనుకబడిన వర్గాలు ములాయం తమ నాయకుడిగా భావిస్తున్నాయి. సమర్థులు, అసమర్థులు ఎవరో గుర్తించి ప్రజలు ఎన్నుకోవాలి. వెనుకబడిన వర్గాల కోసమే ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఆలోచిస్తాయని అన్నారు.

ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాటకాలు, అబద్ధాలు ఈ ఎన్నికల్లో అస్సలు పనిచేయవని మాయవతి అన్నారు. కాగా దేశ వ్యాప్తంగా తిరుగుతూ వెనుకబడిన వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని హామీ ఇస్తుంది. కానీ కాంగ్రెస్‌, బీజేపీ వల్ల ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరగదు. తాము అధికారంలోకి వస్తే మాత్రం పేదలకు, వెనుకవడిన వర్గాలకు తప్పకుండా సరైనా ఉద్యోగాలు వస్తాయని హామీ ఇస్తున్నానని మాయావతి స్పష్టం చేశారు. 

Similar News