జేడీపై వైసీపీ నేత సంచలన ఆరోపణలు

Update: 2019-03-29 08:35 GMT

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఆయా పార్టీ అధినేతలు ఒకరిపై మరోకరు విమర్శలతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉండగా ఇటివలే జనసేన తీర్థం పుచ్చుకున్న జేడీ లక్ష్మీనారాయణపై వైసీపీ నేత, అమలాపురం లోక్‌సభ సభ్యుడు రవీంద్రబాబు ఆరోపణలు చేశారు. అయితే హైదరాబాద్ శివారు శంకర్ పల్లిలో ఒక్కఎకరం భూమిని లక్ష్మీనారాయణ అతి తక్కువ ధరలోనే రూ.4 లక్షలకే కొన్నరని రవీంద్రబాబు ఆరోపించారు.

శుక్రవరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాగుతూ నిజాయితీపరుడైన అధికారిగా చెప్పుకునే లక్ష్మీనారాయణ తిప్పికొడితే ఒక ఏడాదికి రూ.20లక్షలు ఆదాయం మించదని, అలాంటి వ్యక్తి ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం రూ.6.5కోట్ల చరాస్తులు ఎలా చూపించారని జేడీ లక్ష్మీనారాయణను రవీంద్రబాబు ప్రశ్నించారు. అయితే జేడీకి క్విడ్‌ప్రోకోలో భాగంగానే రూ.6.5కోట్ల నల్ల ధనం అందిందని దాన్ని వైట్‌గా మార్చి శంకర్‌పల్లిలో భూమి కొనుగోలు చేశారని రవీంద్రబాబు ఆరోపించారు. జనసేనలో ఉన్న టీడీపీ కోవర్టు అని అన్నారు. టీడీపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మ్యాచ్ ఫిక్స్ ఉందన్నారు.

Similar News