కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

Update: 2019-06-08 07:47 GMT

దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. ఎండలకు అల్లాడుతున్న ప్రజానీకం రుతుపవనాల కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. దీనికి తోడు గత ఏడాది కంటే ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మొత్తానికి రుతుపవనాల రాకతో కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలఖారు నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరిస్తాయి. నాలుగు నెలల పాటు నైరుతి రుతుపవనాలు కొనసాగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11న ప్రవేశించనున్నాయి. 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ నెల 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.నైరుతి అరేబియా సముద్రంపై గంటకు 45 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Tags:    

Similar News