పట్టపగలే.. చేపల చెరువు లూటీ..

Update: 2019-05-13 07:09 GMT

అక్కడ బంగారం నిల్వలు లేవు.. అలాగని ఏ ధన రాశులు లేవు. పోనీ ఏ రాజకీయ నాయకుడి పర్యటన కూడా లేదు. కాని వందలు, వేలాది మంది ఒకే సారి తరలివచ్చారు. సమీపంలో ఉన్న చెరువులోకి ఒక్క సారిగా దూకారు. తమ దగ్గరున్న వలలు, పంచలు, టవళ్లలో చేపల వేట ప్రారంభించారు .

10 గ్రామాల ప్రజలు, ఇతర గ్రామాల మత్య్సకారులు చేపల చెరువును లూటీ చేసిన ఘటన సూర్యపేట జిల్లా మునగాలలో చోటు చేసుకుంది. మండలంలో 200 ఎకరాల్లో విస్తరించిన గణపరం చెరువులో మత్య్యకార సంఘం గత రెండేళ్లుగా చేపలను పెంచుతోంది. వేసవి కారణంగా చెరువులో నీరు తగ్గుతూ ఉండటంతో అక్కడక్కడా చనిపోయిన చేపలు వచ్చి ఒడ్డున పడుతుండేవి. అయితే చేపలు పెద్దవి కావడంతో ... చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ఇతర ప్రాంతాల మత్స్యకారులు చేపల వేట ప్రారంభించారు. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి ఒకే సారి వేలాది మంది చేపల చెరువు దగ్గరకు చేరుకున్నారు. దీంతో ఒక్క సారిగా తొక్కిసలాట జరిగింది. విషయం తెలిసి చేపల చెరువు దగ్గరకు చేరుకున్న పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు.

పోలీసులు వెళ్లిన విషయం తెలుసుకున్న స్ధానికులు మరోసారి చేపల వేటకు దిగారు. దొరికన కాడికి తీసుకుని వెళ్లిపోయారు. ఈ విసయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మత్య్సకార సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 లక్షల విలువైన చేపలు లూటీ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Full View    

Similar News