మే 23న ఏపీలో జనసేన తుఫాన్.. పవన్ పార్టీకి 120-154 సీట్లట: ధన్‌రాజ్

Update: 2019-05-18 07:49 GMT

ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఫలితాలతో ఏపీ హీరో ఎవరో? జీరో ఎవరో మే 23న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో బరిలో దిగిన అభ్యర్థులతో పాటు ఓటేసిన ఓటర్లలో తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ లోపే ఎవరికి వారు గెలుపోటముల లెక్కలు వేసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి తిరిగి మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందని తెలుగు తమ్ముళ్లు.. ఏపీలో ఈసారి పక్కా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక కొత్తగా ఎన్నికల రణరంగలో దిగిన జనసేన నిశ్శబ్ద విప్లవం సంచలనాలు నమోదు చేస్తుందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై జబర్దస్త్ కమెడియన్ ధన్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈనెల 23న ఆంధ్రప్రదేశ్‌లో జనసేన శతఘ్ని తుఫాన్ రాబోతోందని..గంటకు 120-145 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని కమెడియన్ ధన్ రాజ్ ఫేస్‌బుక్‌ పోస్ట్ పెట్టారు. ఇక ఆ ఈదురుగాలుల ధాటికి ఎవరైనా కొట్టుకుపోతే తమకు సంబంధం లేదని కమెడియన్ ధన్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ ఎన్నికల్లో జనసేనకు 120 నుంచి 145 స్థానాలు రాబోతున్నాయన్నది ఆ పోస్టు సారాంశం. శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని ధన్‌రాజ్ అభిప్రాయపడ్డాడు.




అయితే ఇదిలాఉంటే మరో వైపు ధన్‌రాజ్ ఫేస్‌బుక్ పోస్టుపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున జోకుల మీద జోకులు పేలుతున్నాయి. అసలు ఏపీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి? జనసేన ఎన్ని సీట్లలో పోటీచేసిందో తెలుసా? అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ధన్ రాజ్‌ని ఏకి పారేస్తున్నారు. అసలు ఇన్నాళ్లు ఎక్కడికి పోయావంటూ తెగ సెటైర్లు వేస్తున్నారు. నెటిజన్ల కామెంట్ కు తట్టుకోలేక జబర్దస్త్ కమెడియన్ దన్‌రాజ్ ఆ పోస్టును వెంటనే డిలీట్ చేశాడు. కానీ అప్పటికే చాలామంది స్క్రీన్ షాట్స్ తీయడంతో ఆ పోస్టు తెగ వైరల్‌గా మారింది. మొత్తానికి మొన్నటి వరకూ జనసేన పార్టీ తరుపున జబర్దస్త్ ఆది పేరు ఎక్కువగా వినిపించేది.. ఇప్పుడు ఫలితాల నేపథ్యంలో ప్రభంజనం అంటూ ఓపెన్ అయ్యి వార్తల్లో నిలిచాడు ధనరాజ్. మొత్తానికి ఏపీ విజేత ఎవరో? పరజితులేవరో మరో నాలుగు రోజుల్లో తేలిపోనుంది.  

Similar News