రాయలసీమ ప్రగతి కోసం వైఎస్ఆర్ పరితపించారు: జగన్

Update: 2019-03-30 06:21 GMT

రాయలసీమ ప్రగతి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పరితపించారని ఆయన తనయుడు వైఎస్ జగన్ అన్నారు. వైఎస్ఆర్ హయంలో 80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను తరువాతి ప్రభుత్వాలు ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా నందికొట్కూరులో పర్యటించిన ఆయన సీఎం చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు మేలు చేయడంలో చివరి స్ధానంలో ఉన్న చంద్రబాబు అవినీతి, అక్రమాలు, డేటా చోరిలో నెంబర్ వన్ స్ధానంలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రైతులకు ఐదు విడతల్లో 50 వేల రూపాయలను పెట్టుబడి నిధిగా అందిస్తామని తెలియజేశారు. 

Similar News