ప్రధాని దోషి కానప్పుడు భయం ఎందుకు?

Update: 2019-03-07 06:31 GMT

దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ డీల్ వ్యవహారంలో ఫైళ్లు పోయాయంటూ కేంద్ర ప్రభుత్వం కొత్తపాట పాడుతుందంటూ మండిపడ్డారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి విలువైన పత్రాలు కనపడటం లేదని చెప్పడంపై ఆయన మండిపడ్డారు. 30 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఫైల్‌లో క్లియర్‌గా రాశారని, నరేంద్ర మోడీ నెగోషియేషన్ టీమ్‌ను తప్పించి బైపాస్ సర్జరీ చేశారని ఆరోపించారు. అనిల్ అంబానీకి ప్రయోజనం పొందటానికి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఆలస్యం చేశారని ఆరోపించిన ఆయన ప్రధాని నిజంగా దోషి కానప్పుడు భయం ఎందుకు? అని ప్రశ్నించారు. డాక్యుమెంట్లు దొంగతనం వెనక ఎవరున్నారో తేల్చాలని పీఎంవో చేస్తున్న ప్రకటనలపైనా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News