తాళి కట్టి.. తప్పుకున్నాడు

Update: 2019-01-27 09:24 GMT

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్ కు చెందిన రవళి, శ్రీకాంత్ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మేజర్ అయిన ఇద్దరు వారం రోజుల క్రితం ఎవరికి తెలియకుండా గుడిలో పెళ్లి చేసుకున్నారు. ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లగా తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. ప్రియురాలిని రోడ్డుమీద వదిలేసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు శ్రీకాంత్. న్యాయం కోసం రవళి మహిళా సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Similar News