పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అహ్మదాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం జరిగిన ర్యాలీలో హార్దిక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే, తదితరుల సమక్షంలో పార్టీ తీర్ధం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో హార్దిక్ చేరికను రాహుల్ స్వాగతించారు. హార్దిక్ పటేల్ తప్పనిసరిగా రాబోయే ఎన్నికలో విజయం సాధిస్తారని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామానికి తీసుకు వెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హార్ధిక్ పటేల్ అన్నారు.