ఏపీ ప‌్రభుత్వం గవర్నర్‌ల మధ్య మరో వివాదం

Update: 2019-01-30 07:07 GMT

ఏపీ ప‌్రభుత్వం గవర్నర్‌ల మధ్య మరో వివాదం ఏర్పడింది. చుక్కల భూమల క్రమబద్దీకరణ దిశగా ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ తిరస్కరించారు. అసైన్డ్‌, చుక్కల భూముల ఆర్డినెన్స్‌లను గవర్నర్ ఆమోదం కోసం ఏపీ ప్రభుత్వం గతంలో పంపింది. అయితే వీటిని పరిశీలించిన గవర్నర్ చుక్కల భూముల సమస్యను పరిష్కరించే దిశగా ఆర్డినెన్స్‌ లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో జిల్లా స్ధాయి రెవిన్యూ కమిటీల మార్పులను తప్పుబట్టిన గవర్నర్‌ సమస్య పరిష్కారానికి రెండు నెలల సమయం ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసైన్డ్‌మెంట్‌ భూముల ఆర్డినెన్స్‌ను మాత్రమే ఆమోదించిన గవర్నర్‌ చుక్కల భూముల ఆర్డినెన్స్‌ను మాత్రం వెనక్కు పంపారు. ఇటీవల కాలంలో టీడీపీ గవర్నర్‌ టార్గెట్‌గా విమ‌ర‌్శలు చేస్తున్న సమయంలోనే ఆర్డినెన్స్‌ను తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.

Full View 

Similar News