షర్మిళ కలియుగ సీత: ప్రముఖ సినీ రచయిత

Update: 2019-01-15 09:43 GMT
chinni krishna

తనకు, ప్రభాస్ కు మధ్య సంబంధం ఉందంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ స్పందించాడు. షర్మిళపై తప్పుడు ఆరోపణలు బాధాకరమని అన్నారు. ఓటమి భయంతోనే షర్మిళపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిళను కలియుగ సీతగా ఆయన అభివర్ణించారు. మహిళలపై ఆరోపణలు చేసేవారు కుక్కలతో సమానమని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ కుటుంబం వెనుక ఉంటామని చిన్ని కృష్ణ స్పష్టం చేశారు. 

Similar News