రాహుల్ ఆదేశాలు పట్టవా...గాంధీభవన్‌‌లో అసలేం జరుగుతోంది?

జనవరి పది నాటికి డీసీసీలను నియమించాలని టీపీసీసీకి రాహుల్‌‌గాంధీ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంతవరకు కనీసం ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. దాంతో పార్టీ అధినేత ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదనే చర్చ గాంధీభవన్‌‌లో జరుగుతోంది.

Update: 2019-01-11 02:07 GMT
Rahul Gandhi

టీపీసీసీ అధిష్టానం ఆదేశాలను పట్టించుకోవడం లేదా..? నేరుగా రాహుల్‌గాంధీ ఆర్డర్స్‌‌ను సైతం పీసీసీ లెక్కచేయడం లేదా..? జనవరి10 నాటికి డీసీసీలను నియమించాలని ఏఐసీసీ ఆదేశించినా టీపీసీసీ కనీసం ఎందుకు కసరత్తు చేయడం లేదు..? గాంధీభవన్‌‌లో అసలేం జరుగుతోంది.

జనవరి పది నాటికి డీసీసీలను నియమించాలని టీపీసీసీకి రాహుల్‌‌గాంధీ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇంతవరకు కనీసం ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. దాంతో పార్టీ అధినేత ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదనే చర్చ గాంధీభవన్‌‌లో జరుగుతోంది. ప్రస్తుతం నాలుగు జిల్లాలకు మాత్రమే పూర్తిస్థాయి డీసీసీలు పనిచేస్తున్నాయి. రంగారెడ్డి, ఖమ్మం డీసీసీలు ఎప్పట్నుంచో ఖాళీగా ఉన్నాయి. ఇక నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్‌ భిక్షమయ్యగౌడ్‌, మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు సునీతా లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్‌ డీసీసీ చీఫ్‌ మహేశ్వర్‌‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. వీళ్లంతా డీసీసీ పదవులు వద్దని ఎన్నికల్లో పోటీ చేశారని, దాంతో ఈ జిల్లాలకు కొత్త డీసీసీలను నియమించాల్సి ఉందని అంటున్నారు.

కొత్తగా ఏర్పాటైన రెండు జిల్లాలతో కలిపి మొత్తం 33 డిస్ట్రిక్ట్స్‌‌కు కొత్త డీసీసీలను నియమించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో డీసీసీ పదవులు చేపట్టేందుకు పెద్ద నేతలెవరూ ముందుకు రావడం లేదనే మాట వినిపిస్తోంది. దాంతో ఎన్నికలకు ముందు డీసీసీ పదవుల కోసం పైరవీలు చేసుకున్న నేతల లిస్టును అధిష్టానం దగ్గర పెట్టడానికి పీసీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Similar News