దుర్గగుడి పాలకమండలి సభ్యుల రాజీనామా

Update: 2019-05-25 06:29 GMT

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో పలు చోట్ల గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మండళ్లు, కమిటీలు రాజీనామాలు చేస్తున్నాయి. తాజాగా దుర్గగుడి పాలక మండలి రాజీనామా చేసింది. పాలకమండిల ఛైర్మన్‌తో పాటు ఇతర సభ‌్యులకు తమ రాజీనామా లేఖలను దేవాదాయ శాఖకు పంపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని చైర్మన్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఇక పాలక మండలిలో కొనసాగలేమనే అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. పదవీ కాలం కంటే ముందుగానే రాజీనామాలు చేస్తే కొంచెమైన గౌరవంగా దక్కుతుందని మెజారిటీ సభ్యులు చెప్పడంతో సభ్యులందరూ రాజీనామాలకు అంగీకరించారు. ఇక సభ్యులందరూ ఒకేసారి రాజీనామాలు చేసి చైర్మన్‌ గౌరంగబాబుకు అందచేశారు. చైర్మన్‌ తాను కూడా రాజీనామా చేసి సభ్యుల రాజీనామా పత్రాలతో కలిపి ప్రిన్సిపల్‌ సెక్రటరీకి సమర్పించేందుకు సిద్ధమయ్యారు. 

Similar News