నంద్యాలలో గాడిద పోటీలు

Update: 2019-02-21 10:53 GMT

ఏదైనా జాతర జరుగుతుందంటే అక్కడ ఎడ్ల పందాలు, గుర్రం పోటీలు, కోడి పందాలు నిర్వహిస్తుంటారని వింటుంటాం అయితే కర్నూలు జిల్లా నంద్యాలలో వెలసిన శ్రీజంబులా పరమేశ్వరి అమ్మవారి తిరునాళ్లు సందర్భంగా విచిత్రంగా గాడిదల బలప్రదర్శన పోటీలు నిర్వహించారు ఈ పోటీలో పాల్గొనేందుకు అనేక మంది తరలి వచ్చారు.

గాడిదల బలప్రదర్శన పోటీలో వివిధ ప్రాంతాల నుంచి 26 గాడిదలు పాల్గొన్నాయి. 150 కిలోల బరువును మోస్తూ పరిగెత్తాయి గాడిదలు 1234 మీటర్ల దూరం బరువులు మోసిన ఇంద్ర అనే గాడిద ప్రథమ స్థానంలో నిలిచింది. గాడిద యజమానికి 15 వేల రూపాయల నగదు బహుమతి అందుకున్నారు.

గాడిదలను ఇంటి సభ్యులుగాభావించే రజకులు వాటికి రకరకాల సినిమాల పేర్లతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. శ్రీజంబుల పరమేశ్వరీ అమ్మవారికి పూజలు చేసి పోటీల్లో పాల్గొంటున్నారు. రజకులను ప్రోత్సహించడంలో భాగంగానే ప్రతీ ఏటా శ్రీ జంబుల పరమేశ్వరీ అమ్మవారి తిరునాల సందర్భంగా గాడిదల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామంటున్నారు నిర్వాహకులు.

Full View 

Similar News