2019 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌

2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. వచ్చే నెలలో నోటిఫికేషన్‌ వెలువడుతుందనే వార్తల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు అధినేత రాహుల్ గాంధీ చర్యలు చేపట్టారు.

Update: 2019-01-02 05:33 GMT
congress

2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. వచ్చే నెలలో నోటిఫికేషన్‌ వెలువడుతుందనే వార్తల నేపధ్యంలో దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు అధినేత రాహుల్ గాంధీ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని వార్‌ రూంలో ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. రఫేల్ డీల్‌, నోట్ల రద్దు , జీఎస్టీ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఇదే సమయంలో బీజేపీ ఓటమే లక్ష్యంగా పని చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం మహాకూటమి పొత్తులు, రాష్ట్రాల వారిగా ప్రాంతీయ పార్టీలతో సయోధ్యపై చర్చించే అవకాశాలున్నాయి. దీంతో పాటు లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించే అవకాశాలున్నాయి.   

Similar News