చంద్రబాబుతో భేటీ.. టీడీపీలోకి అలీ?

ప్రముఖ హాస్యనటుడు నటుడు అలీ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతిలో సీఎం నివాసంలో చంద్రబాబును కలిశారు. 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తాజా భేటీతో అలీ టీడీపీలో చేరడం ఖాయమనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.

Update: 2019-01-20 09:36 GMT

ప్రముఖ హాస్యనటుడు నటుడు అలీ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతిలో సీఎం నివాసంలో చంద్రబాబును కలిశారు. 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తాజా భేటీతో అలీ టీడీపీలో చేరడం ఖాయమనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది. కాగా గతంలో అలీ ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతో కూడా సమావేశం అయినా విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఇదే రకంగా జోరుగా ప్రచారం వినిపించింది. అలీ ఏ పార్టీలో చేరినా కాని గుంటూరు నుండి బరిలో దిగాడానికే మొగ్గుచూపుతున్నట్లు తెలస్తుంది. కాగా అలీ మంత్రి పదవి ఆశిస్తున్నరని సమాచారం. ఎవరు ఎన్ని విధాలుగా చర్చలు చేసుకుంటున్నాకానీ అలీ మాత్రం తన వ్యక్తి గత అభిప్రాయాన్ని ఎక్కడ కూడా వెల్లడించలేదు.

Similar News