మద్యపాన నిషేధంలో జగన్ సక్సెస్ అవుతారా?

Update: 2019-06-06 05:21 GMT

ఏపీలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించినా అరదుకు ఆచరణ ఎలా వుండబోతున్నదీ చర్చనీయాంశంగా వుంది. బెల్ట్‌ షాపులను నివారించాలని సిఎం ఆదేశించినా, క్షేత్ర స్థాయిలో మాత్రం పుట్టగొడుగుల్లా బెల్ట్‌ దుకాణాలు కనిపిస్తున్నాయి. ఎమ్మార్పీ అమలు ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బెల్ట్‌ దుకాణాల వ్యాపారం యదేచ్ఛగా సాగిపోతోంది. ప్రతి మద్యం దుకాణానికి సగటున పది బెల్ట్‌ షాప్ లు ఉన్నాయి. బెల్ట్ షాప్ లు ఎత్తివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన ప్రతిసారీ క్షేత్ర స్థాయిలో కేసులు పెట్టడర, తరువాత చూసీచూడనట్టుగా విడిచిపెట్టడం ఆనవాయితీగా మారిపోతోరది.

జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత బెల్ట్‌ దుకాణాలపై కఠినంగా ఉరడాలని ఆదేశిరచారు. వెంటనే అధికారులు ఒక నివేదిక తయారుచేసి జగన్‌కు సమర్పిరచారు. ఇరదులో కేవలం ఐదు నెలల్లోనే భారీగా బెల్ట్‌ షాపులపై కేసులు పెట్టినట్లుగా చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,255 బెల్ట్‌ దుకాణాలపై కేసులు నమోదుచేసి పది వేల మందిని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. అయితే, ఈ కేసులు ఎన్నికల సమయంలో పెట్టినవే కావడం విశేషం.

మద్యం వ్యాపారంలో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై అధికారులు కాకి లెక్కలు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,374 లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలు ఉండగా, కేవలం 126 చోట్ల మాత్రమే ఎమ్మార్పీ ఉల్లంఘనలు చోటుచేసుకున్నట్లు రిపోర్టు ఇచ్చారు. రాజధాని కృష్ణా జిల్లాల్లోనే 700 వరకు ఉన్న దుకాణాల్లో అన్ని చోట్లా ఎమ్మార్పీ ఉల్లంఘనలే కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో దుకాణాలు సిండికేట్లుగా మారి అదనపు ధర వసూలు చేస్తున్నాయి. నకిలీ మద్యం దందా ఉత్తరాంధ్రలో ఎక్కువగా జరుగుతోంది. అయితే కేవలం 13 కేసులు మాత్రమే అధికారులు నమోదు చేశారు. బెల్ట్ షాప్ లపై కఠినంగా వ్యవహారించాలని సీఎం జగన్ ఆదేశించారు. అధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. బెల్ట్ షాప్‌ల బంద్‌లో జగన్ సర్కార్ సక్సెస్ అవుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. 

Full View

Tags:    

Similar News