కోటా బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

చారిత్రాత్మకమైన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు భవితవ్యం సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన ఈబీసీ కోటా బిల్లును ఓ స్వచ్ఛంద సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.

Update: 2019-01-10 10:48 GMT

చారిత్రాత్మకమైన ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు భవితవ్యం సుప్రీంకోర్టుకు చేరింది. తాజాగా పార్లమెంటు ఆమోదం పొందిన ఈబీసీ కోటా బిల్లును ఓ స్వచ్ఛంద సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమంటూ రిట్ పిటిషన్ వేసింది. రిజర్వేషన్లకు ఆర్థిక స్థితి ప్రామాణికం కాదన్న పిటిషనర్ 124వ రాజ్యాంగ సవరణ చేసి తెచ్చిన ఈబీసీ కోటా బిల్లు సమానత్వ హక్కుకు వ్యతిరేకమని చెబుతున్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందనీ ఇప్పుడు ఈబీసీలకు 10 శాతం కోటా ఇవ్వడంతో ఆ తీర్పును ధిక్కరించినట్లయ్యిందని పిటిషనర్ వివరించారు.

Similar News