దానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి అవసరం లేదు : ప్రధాని మోడీ

Update: 2019-05-12 10:15 GMT

టెర్రరిస్టులను కాల్చిపారేయడానికి ఎలక్షన్ కమిషన్ అనుమతి అవసరం లేదని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ కుషినగర్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. జవాన్ల ఎదుట టెర్రరిస్టులు బాంబులతో నిలబడితే, వారిని కాల్చాలా వద్దా అని ఎన్నికల కమిషన్ ను అడుగుతారా అంటూ ఆయన ప్రశ్నించారు. కాశ్మీర్ లో ప్రతి రెండు, మూడు రోజులకూ టెర్రరిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతూనే ఉంటోంది. అలాటప్పుడు ఆ ప్రక్రియ కోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని ప్రధాని పేర్కొన్నారు.

దేశమంతా కమలం వికసిస్తోందని ఈ సందర్బంగా అయన వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారని, బలమైన నాయకత్వం దేశానికి అవసరమని వారు గుర్తించారని చెప్పారు. మళ్లీ బిజెపి అధికారం లోకి వస్తుందన్న సంకేతాలతో మహమిలావత్ గ్రూప్ తట్టుకోలేకపోతోందని విమర్శించారు. అందుకనే ఇష్టం వఛ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.

అయితే, బీజేపీ జాతీయత, దేశ భద్రత అంశాలను తన ఎన్నికల ప్రచారం లో వాడుకొంటోంది. దీనిపై విపక్షాలు కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పట్లేదు. కానీ, మోడీ నా సైన్యం అంటూ భారత దేశ సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలకు మాత్రం మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 

Similar News