ఏపీ టెన్త్‌ ఫలితాలు విడుదల..టాప్‌లో ఆ జిల్లానే

Update: 2019-05-14 05:27 GMT

ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యా కమిషనర్‌ (సీఎస్ఈ) కార్యాలయంలో ఉదయం 11గంటలకు విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. గ్రేడ్‌లు, గ్రేడ్‌ పాయింట్లు, జీపీఎల్‌ విభాగాల్లో ఫలితాలను ప్రకటించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాల్లో 94.88 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 94.68, బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత. ఇక ఎప్పటిలాగే టెన్త్ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. 5,464 స్కూళ్లలో 100శాతం ఉత్తీర్ణత పొందగా మూడు స్కూళ్లో మత్రం జీరో శాతం ఉత్తీర్ణత వచ్చింది. 98.19 శాతంలో మొదటి స్థానంలో తూ.గో జిల్లా నిలువగా చిట్ట చివరి స్థానంలో నెల్లురు జిల్లా (83.19) నిలిచింది. 

Similar News