లగడపాటి జోస్యం పై..రోజా రియాక్షన్ ఏంటో తెలుసా ?

Update: 2019-05-20 03:31 GMT

ఏపీలో వైసీపీదే అధికారమని లగడపాటి మినహా మిగిలిన అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, లగడపాటి సర్వేలు ఎక్కడా నిజం కాలేదని వైసీపీ నాయకురాలు రోజా విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే ఏపీలో అధికారం వైసీపీదేనని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఏడో దశ ఓటింగ్ ముగియగానే పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ వందశాతం వైసీపీ అధికారంలోకి రాబోతుంది. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే కాకుండా ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే స్పష్టంగా అర్థంమౌతోందని జగన్ నాయకత్వం కోసం ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డిగారి పాలన తిరిగి చూడలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని స్సష్టంగా తెలుస్తోందని ఎమ్మెల్యే రోజా అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మాటల గారాడి బెట్టింగ్ లకు మాత్రమే ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. గతంలో కూడా జయలలిత ఓడిపోతుందని మాజీ ఎంపీ లగడపాటి చెప్పారు కానీ ఫలితాలు వచ్చేసరికి జయలలితనే విజయకేతనం ఎగురవేసిందని అన్నారు. ఇక కర్ణాటకలో బీజేపీ వార్ వన్ సైడ్ అవుతుందని అన్నారు కానీ ఫలితాలు మాత్రం అందుకు బిన్నంగా వచ్చి కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక పక్క రాష్టమైన తెలంగాణలో కూడా అసెంబ్లీ ఫలితాలో లగడపాటి సర్వే మహాకూటమి భారీ విజయం సాధించబోతుందని చెప్పారు. కానీ ఆయన చిలక జోస్యం ఫలించేలేదు చివరికి తెలంగాణలో టీఆర్ఎస్ జెండా రేపరేపలాడిందని అన్నారు. మొత్తానికి లగడపాటి సర్వే మీద ప్రజలు విశ్వసనీయత కోల్పోయారు. ఇప్పుడు లగడపాటిని ఒక జోకర్ లాగా ప్రజలు చూస్తున్నారని అన్నారు. కేవలం లగడపాటి జోస్యం బెట్టింగ్ కోసం ప్రజలను మోసం చేసి డబ్బులు దండుకోవడం కోసం ఈ విధమైన సర్వేలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి మాత్రం టీఆర్ఎస్ పార్టీపైన బెట్టింగ్ పెట్టి ప్రజలను మాత్రం మహాకూటమి వైపు మొగ్గుచూపి తాను లాభపడ్డారని అన్నారు. అసలు ఆయన ప్రజలు ఏ ఒక్కరు నమ్మే పరిస్థితే లేదన్నారు. లగడపాటి అంటేనే మోసాని, తప్పుడు సమాచారానికి కేరఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారని రోజా అన్నారు.

Similar News