టీఆర్ఎస్‌తో జగన్ దోస్తీ.. సీమకు అన్యాయం: దేవినేని

నాలుగు కాంట్రాక్టుల కోసం వైసీపీ అధినేత జగన్ టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. రాయలసీమకు జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

Update: 2019-01-20 06:37 GMT

నాలుగు కాంట్రాక్టుల కోసం వైసీపీ అధినేత జగన్ టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. రాయలసీమకు జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ ముసుగు తీసేసి మోడీ, కేసీఆర్, జగన్ జనం ముందుకు రావాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలుచిపోతవని మండిపడ్డారు. తాము నాలుగు సంవత్పరాలుగా పోరాటం చేస్తున్నాం, సుప్రీం కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ విధంగా తాము అలుపెరగని పోరాటం చేస్తావుంటే నువ్వు శత్రుపక్షమైన కేసీఆర్ పక్కన చేరి నాలుగు కంట్రాక్టు పనులకు కక్రుత్తిపడి వందలకోట్ల అవినీతి రూపాయలకు ఆశపడి జగన్ టీఆర్ఎస్‌తో జతకట్టారని అన్నారు. కేసీఆర్, మోడీ, జగన్ ప్రాణమిత్రులని ఎద్దేవా చేశారు. 

Similar News