స్మార్ట్ఫోన్ను చూస్తూ నడుస్తోన్న ఓ యువతి ప్రమాదానికి గురైన ఘటన చైనాలోని షాంఘైలో చోటు చేసుకుంది. ఒక ప్రయివేటు కంపెనీలో ఆ యువతి పనిచేస్తోంది. తన పని ముగించుకున్నాక ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ దగ్గరకు వచ్చింది. అంతలోనే స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ.. అడుగులు ముందుకు వేసింది. మొబైల్ చూసుకుంటూనే... లిఫ్ట్లోపలకు అడుగులు వేసింది. అయితే అప్పటికే లిఫ్ట్ డోర్లు మూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించని యువతి అలాగే లోపలకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఒక కాలు బయట ఉండగానే లిఫ్ట్ వేగంగా కదిలింది. లిఫ్ట్ వేగం అందుకోవడంతో.. ఆమె కాలు.. అక్కడే పచ్చడి అయిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవడంతో.. వెలుగులోకి వచ్చింది.