మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుంటే..మురళీగానం ఆలపించిన బామ్మ

Update: 2018-04-03 12:05 GMT

ఆపరేషన్ అంటేనే భయపడతాం. అందులోనూ తమకు జరుగుతున్న చికిత్సను చూస్తూ ఆపరేషన్ చేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఓ బామ్మ.. ఏకంగా శస్త్రచికిత్స జరుగుతుంటే, ప్లూట్ ఊదుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ..

ఓ వైపు మెదడుకు శస్త్రచికిత్స జరుగుతుంటే వేణుగానాన్ని ఆలపించి సంచలనం సృష్టించింది ఓ బామ్మ. ఈ అరుదైన ఘటనకు అమెరికాలోని మెమోరియల్‌ హెర్మన్‌ టెక్సాస్‌ మెడికల్‌ సెంటర్‌ ఆసుపత్రి వేదికైంది. వేణువు ఊదడంలో 63ఏళ్ల అన్నా హెన్రీ దిట్ట. అయితే కొంత కాలంగా ఆమె ఎసెన్షియల్‌ ట్రెమర్‌ తో బాధపడుతున్నారు. దీంతో చికిత్సలో భాగంగా మెదడుకు శస్త్రచికిత్స అవసరం అవుతుందని వైద్యులు సూచించారు. 

ఆపరేషన్ లో భాగంగా మెదడును విద్యుత్‌తో ప్రేరేపించే సమయంలో ప్లూట్ ఊదాల్సి ఉంటుందని డాక్టర్లు హెన్లీకి చెప్పారు. దీంతో సూక్ష్మ ఎలక్ట్రోడ్‌లను మెదడులో పంపుతున్న సమయంలో ఆమె లయబద్ధంగా వేణువును ఊదారు. ఆ సమయంలో చేతులు వణుకుతున్నాయో లేదో జాగ్రత్తగా గమనిస్తూ వైద్యులు ఆపరేషన్ కొనసాగించారు. చికిత్స నిర్వహిస్తుండగా బెడ్ పై పడుకొని ఆమె ప్లూట్ ను ఊదుతున్న విజువల్స్ ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి. విద్యుత్‌ ప్రేరణను నియంత్రించేందుకు హెన్రీ ఛాతికి ఓ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. చివరికి ఈ చికిత్స విజయవంతమైంది. అంతేకాదు, ఇక నుంచి ఆమె ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదన్నారు. 

Similar News