షూటింగులో ప్రమాదం నుంచి బయటపడిన విజయ్ దేవరకొండ

Update: 2018-12-17 08:03 GMT

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ సైట్స్ పై గాయపడ్డారు. విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. తాజాగా విజయ్ దేవరకొండపై ఒక సీన్ చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యాడు. ఒక సీన్లో ఆయన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వేగంగా మెట్లు దిగివచ్చి కదులుతోన్న ట్రైన్ ఎక్కాలి. అలా పరిగెత్తుకొచ్చి ట్రైన్ ఎక్కబోయిన ఆయన పట్టుతప్పి పడిపోయాడు. దాంతో అక్కడి సిబ్బంది వెంటనే తేరుకుని ఆయనను పక్కకి లాగేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంలో విజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తన ఎడమ చేతికి తగిలిన గాయాన్ని చూపిస్తూ ‘లైఫ్‌లో ఏదీ ఈజీగా రాదు’ అంటూ సోషల్ మీడియాలో విజయ్ పోస్ట్ పెట్టాడు. అయితే ‘పెథాయ్’ తుపాను కారణంగా ప్రస్తుతం ఈ చిత్రబృందం షూటింగ్‌ను వాయిదా వేసుకుంది.

Similar News