నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ నేటి తరం హీరోలతో పోటీ పడుతున్నారు. పైసావసూల్, జైసింహాలతో బిజీగా ఉన్న బాలయ్య త్వరలో ఎన్టీఆర్ బయోపిక్ లో యాక్ట్ చేస్తున్నారు. నేనే రాజు - నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన తేజ ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించనున్నాడు. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ బయోపిక్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రను పోషించనున్నాడు. ఇక ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర ఎవరు చేయబోతున్నారు అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులోభాగంగా బసవతారకంగా ఎవరిని తీసుకోవాలో చిత్రయూనిట్ కసరత్తులు ప్రారంభించింది. బసవతారకం పాత్రకోసం ఆడిషన్స్ నిర్వహించాలని డైరక్టర్ తేజ- బాలకృష్ణ భావించారు. ఆడిషన్స్ తో సెలక్ట్ చేసుకోవడం కష్టతరం కావడంతో టెక్నాలజీ సాయం తీసుకోనున్నాడు డైరక్టర్ తేజ. ఇందుకోసం ఫేస్ రిక్నగిషన్ అనే సాఫ్ట్ వేర్ సాయంతో బసవతారకం ముఖ కవళికలు ఉన్న ఆర్టిస్ట్ ను ఎంపిక చేసుకుంటారు. ఆడిషన్స్ కోసం వచ్చిన వారి ఫోటోల్ని సాఫ్ట్ వేర్ లో అప్ డేట్ చేస్తే ...ఆ సాఫ్ట్ వేరే బసవతారకం పోలిన పోటోల్ని సెలక్ట్ చేస్తుంది. అలా సెలక్ట్ చేసిన ఫోటోల ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ లో బసవతారకాన్ని ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది.