‘‘ఈ సంక్రాంతి వేళ ‘గ్యాంగ్’ మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుందని ఆశిస్తున్నా. నాకు మాత్రం మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు కావాలి’’ అని అన్నారు సూర్య. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గ్యాంగ్’. కీర్తి సురేష్ కథానాయిక. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కథానాయకుడు సూర్య మాట్లాడుతూ.. ‘‘2018లో అందరి కలలు సాకారం కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ‘గ్యాంగ్’ అనేది చాలా ముఖ్యమైంది. మన అందరికీ స్కూల్, కాలేజ్, పనిచేసే చోట గ్యాంగ్ కచ్చితంగా ఉంటుంది. అది మన జీవితంలో చాలా ముఖ్యం. ఈ సినిమాకు ‘గ్యాంగ్’ అని పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ‘గ్యాంగ్’ రావడానికి ప్రధాన కారణం నిర్మాత అల్లు అరవింద్ గారు. ఆయనకు ధన్యవాదాలు. నా జీవితంలో నాకో గొప్ప ఆశీర్వాదంలాంటిది. ఎప్పటికీ మర్చిపోలేను. నేను నటించిన అన్ని సినిమాలు ఇక్కడ విడుదల కావడానికి జ్ఞానవేల్ రాజా చాలా కృషి చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్లకు ప్రత్యేక ధన్యవాదాలు.
మొదటి సారి తను డబ్బింగ్ చెప్పాను అని తెలుగులో ఒక డైలాగ్ కూడా చెప్పాడు. గుండెల్లో దైర్యం చేతిలో ధర్మం ఉంటే దేనికి బయపడక్కర్లేదు అని సూర్యా చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ఇక చిత్రానికి పని చేసిన గ్యాంగ్ మొత్తాన్ని పొగుడుతూ ఈ సంక్రాంతికి మీ ముందుకు రాబోతున్న సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అని అలాగే పవర్ స్టార్ సినిమా అజ్ఞాతవాసి కూడా రాబోతోంది. ఆ సినిమా కూడా చుడండి అని సూర్యా పవన్ అభిమానులను ఆకర్షించాడు. ఫైనల్ గా మీ ప్రేమ నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది అంటూ మీ ఆశీస్సులు ప్రేమ ఇంకా కావాలి అంటూ ఫైనల్ గా ప్రసంగాన్ని ముగించాడు.