ఇంట్లో ప‌నిచేసే యువ‌కుడికి పెళ్లి చేసిన హీరో సూర్య

Update: 2018-01-24 07:47 GMT

తమిళ హీరో సూర్య కుటుంబం తమిళ రాజకీయాలకు దూరంగా ఉంటుంది. మిగిలిన సినీ ప్రముఖులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయాలతో సంబంధం కలిగి ఉంటారు. కానీ, రాజకీయాలతో సంబంధం లేకుండా సూర్య కుటుంబం స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది. 'అరగం' ఫౌండేషన్ ద్వారా సూర్య పలు సేవాకార్యక్రమాలను చేస్తుంటాడు. సూర్య, కార్తీలు తమ అభిమానులతో చాలా ఆప్యాయంగా మెలుగుతుంటారు. తాజాగా తన వద్ద పని చేసే ఓ యువకుడికి సూర్య దగ్గరుండి పెళ్లి చేయించాడు. సూర్య కుటుంబ స‌మేతంగా హాజ‌ర‌య్యాడు. పెళ్లిని ద‌గ్గ‌రుండి జ‌రిపించాడు. కుటుంబ పెద్ద‌గా తాళిని స్వ‌యంగా అందించాడు. అలాగే ఆ పెళ్లి ఖ‌ర్చునంత‌టినీ భ‌రించాడు. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Similar News