కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డికి మళ్లీ పెళ్లి. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది. ఇటీవల రెండో బిడ్డ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశాడు శ్రీనివాస్‌రెడ్డి . మళ్లీ పెళ్లి ఏంటి అని ఈఫొటో చూసిన వాళ్లు అందరూ అడుగుతున్నారు. అయితే ఈ ఫొటో వెనుక అసలు కథ వేరే ఉంది. ఈ విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే నిజం పెళ్లి కాదులెండి. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం జంబ లకిడి పంబ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సంచలన విజయం సాధించిన జంబ లకిడి పంబ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అదే జానర్ లో తెరకెక్కనుంది. కమెడియన్ గా కొనసాగుతూనే హీరోగానూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం జంబ లకిడి పంబ సినిమాతో పాటు అనసూయతో కలిసి సచ్చింది రా గొర్రె సినిమాలోనూ నటిస్తున్నాడు.
Malli Pelli ? #jambalakidipambamovie @Siddhi_Blue pic.twitter.com/aeEfPrLjUd
— Srinivasareddy (@Actorysr) January 5, 2018