తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ కొంతకాలం పాటు ప్రకంపనలు రేపిన నటి శ్రీరెడ్డి.. ఫేస్బుక్లో శ్రీ లీక్స్ అంటూ తనకు గుర్తొచ్చినప్పుడల్లా.. ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనం రేపుతోంది. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, హీరోగా రాణిస్తున్న రాఘవ లారెన్స్ గురించి తన ఫేస్బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది.‘ఓ రోజు నేను నా స్నేహితుల ద్వారా లారెన్స్ మాస్టర్ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటలో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని తన రూమ్‌కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది. అనంతరం నెమ్మదిగా లారెన్స్ నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చి.. కొత్తగా ఇక్కడికి వచ్చే చాలా మందికి, పేద పిల్లలకి సహాయం అందిస్తున్నానన్నారు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అ తరువాత లారెన్స్ తన నిజస్వరూపం చూపించారు. నా నడుముతో పాటు ఇతర శరీర భాగాలు చూపించమన్నాడు. నాతో అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేశాడు. అనతరం లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతో లారెన్స్‌తో కొంత కాలం పాటు స్నేహంగా ఉన్నాన్నాను. ఇందులో బెల్లంకొండ సురేష్ చివరికి విలన్ అయ్యారన్నారని’ శ్రీరెడ్డి పేర్కొన్నారు.