ప్రముఖ నిర్మాత మహేష్ భట్ భార్య, అలియా భట్ తల్లి, సినీ నటి సోనీ రజ్ధాన్ గతంలో తనకి ఎదురైన అనుభవాలని ఓ ఇంటర్వ్యూలో వివరిస్తూ అందరిని షాక్‌కి గురి చేసింది. మీటూలో భాగంగా ప్రస్తుతం పలువురు సెలబ్రిటీలు తమకి ఎదురైన లైంగిక వేధింపుల గురించి బాహటంగా చెబుతున్నారు. తను శ్రీ దత్తా, సోనా మహాపాత్ర, వింటా నందా, సంధ్యా మృదుల్ తదితర మహిళలు లైంగిక వేధింపులకి సంబంధించిన విషయాలని బయటపెట్టగా, తాజాగా అలియా తల్లి సోనీ రజ్ధాన్ తనపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన విషయాలు తెలియజేసింది. తాను లైంగిక వేధింపులు ఎదుర్కోకపోయినా, లైంగిక దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక వ్యక్తి తనపై అత్యాచారం జరిపేందుకు విఫలయత్నం చేశాడని, అదృష్టవశాత్తూ అతని ప్రయత్నం ఫలించలేదని క్వింట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దారుణ ఘటన జరిగినప్పటికీ నిందితుడి కుటుంబంపై ప్రభావం పడుతుందనే కారణంతో వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేయలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాను అతడితో మాట్లాడలేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాధ్ ప్రవర్తన గురించి ప్రస్తావిస్తూ అలోక్ నాథ్ ప్రవర్తన అమర్యాదకరంగానే ఉంటుందని, మద్యం సేవిస్తే అలోక్ నాధ్ మరింత రెచ్చిపోతాడన్నారు. అలోక్ తనను చూసే పద్ధతి తనకు నచ్చేది కాదని చెప్పుకొచ్చారు.