ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్‌డే ట్రీట్‌ ఇచ్చిన ప్రభాస్‌

Update: 2018-10-23 07:16 GMT

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు  బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చేశాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ హిస్టరీ క్రియేట్‌ చేసుకున్న యంగ్‌స్టార్‌ తన అప్‌కమింగ్‌ మూవీ సాహోతో మెస్మరైజ్‌ చేయబోతున్నాడు. బాహుబలి తర్వాత  తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన మేకింగ్‌ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్న డార్లింగ్‌ అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చేశాడు. 

రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని యూవీ క్రియేషన్స్ వాళ్లు తెరకెక్కిస్తోంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ యూనిట్ ‘షేడ్స్ ఆఫ్ సాహో’ చాప్టర్ 1 అంటూ దుబాయిలో పిక్చరైజ్ చేసిన ఛేజింగ్ సీన్స్‌కు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌ను రిలీజ్ చేసింది. మేకింగ్‌ వీడియో దుమ్మురేపడంతో పాటు  బైక్‌పై ప్రభాస్ ఎంట్రీ అదిరిపోవడంతో ఫ్యాన్స్‌ ఖుషి అవుతున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ కాబోతున్నది. 

Similar News